Centre for Sustainable Agriculture-Vepada farm advisory
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-66mm మొతాదులో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-15km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSRపురం, క్లస్టర్లలో ఉన్న రైతులు ప్రధాన పంటగ వరి వేసుకుంటున్నట్లయితె విత్తన ఎంపికలో చాలా జాగ్రత్త అవసరం.మంచి పంటకు మంచి విత్తనమే మేలు. పంట కాలం, నీటి అందుబాటు, నేల స్వభావం, స్థానిక వాతావరణ పరిస్తితులను బట్టి విత్తన ఎంపిక అధరపడి ఉంటుంది. వరిలో మధ్యస్థ సన్న రకమైన MTU 1121 స సుడిధోమ, అగ్గి తెగులును తిట్టుకొని 120రోజుల కాల వ్యవధిలో దిగుబడిని ఇస్తుంది. సోనా మసూరి,సాంబ మసూరి, స్వర్ణ వంటి సన్నని రకాలు 140-150రోజుల కాలవ్యవధి లో దిగుబడిని ఇస్తాయి. వీటిలో స్వర్ణ ఆకు ముడత వ్యాధిని తట్టుకుంటుంది మరియు సోనమసూరి అగ్గి తెగులు,ఉల్లి కోడును , సాంబా మసూరి రకం సుడిధోమ, ఉల్లికోడు,అగ్గి తెగులును తట్టుకునే శక్తి కలవు. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
About the author